ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు.. ఒక్క హిట్ మాత్రమే అందుకున్న హీరోయిన్..!
2007లో చిరుత చిత్రం ద్వారా మొదటిసారి తన సిరి కెరీర్ ని మొదలుపెట్టింది హీరోయిన్ నేహా శర్మ. మెగాస్టార్ రామ్ చరణ్ తో నటించిన నేహా శర్మ ఆ తర్వాత 2009లో కుర్రాడు అనే సినిమాతో మరింత దగ్గరయింది. కానీ ఈ సినిమా ఎందుకో సక్సెస్ అందుకోలేకపోయింది. 2010లో వచ్చిన క్రూక్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది నేహా శర్మ. ఈ చిత్రం తర్వాత చాలానే ఆఫర్ సైతం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తన పదహారేళ్ళ సిని కెరియర్లో కేవలం ఒక్క హిట్టు మాత్రమే ఉన్నది.
ఒకవైపు బాలీవుడ్లో మరొకవైపు టాలీవుడ్ లో నటించిన సక్సెస్ కాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గానే ఉంటుంది. అందం, అభినయం ఉన్నప్పుడు ఎందుకో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయింది. నేహా శర్మ ఆస్తులు కూడా 20 కోట్లకు పైగా ఉన్నాయి. ఈమె తండ్రి అజిత్ శర్మ బీహార్ శాసనసభలో భాగల్పూర్ నియోజకవర్గం నుంచి చాలా సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. నేహా శర్మ 2020 నుంచి సినీ పరిశ్రమకు దూరంగానే ఉన్నది. సోషల్ మీడియాలో నేహా శర్మ గురించి ఏదో ఒక విషయం మారుతుంది.