టెన్షన్ లో సూర్య !

Seetha Sailaja
సమ్మర్ సీజన్ మొదలై ఒక నెల పూర్తి అయినప్పటికీ ధియేటర్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న పట్టణాలలో అయితే జనం లేక మ్యాట్నీ షోలు సెకండ్ షోలు క్యాన్సిల్ అవుతున్నాయి అన్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చే వారం మే 1న విడుదల కాబోతున్న నాని ‘హిట్ 3’ సూర్య ‘రెట్రో’ మూవీల మధ్య పోటీ అత్యంత ఆశక్తి దాయకంగా మారింది.



నానితో పోల్చుకుంటే సూర్య టాప్ హీరో తమినాడులో రజనీకాంత్ కమలహాసన్ విజయ్ ల తారువతా సూర్య కు టాప్ హీరోగా స్థానం ఉంది. అతడి సినిమాను దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని భాషల ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు పొందిన తరువాత సూర్య తన సినిమాలో ప్రయోగాలు ఎక్కువ చేస్తున్నాడు. దీనికి ఉదాహరణ రెండు నెలల క్రితం విదుడులైన ‘కంగువ’.



ఈసినిమా కోసం సూర్య రెండు సంవత్సరాలు కష్టపడినా ఆయినిమా భంకారమాయిన ఫ్లాప్ గా మారింది. దీనితో ప్రయోగాలు మానుకుని ఒక్క కమర్షియల్ సినిమాను కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈమూవీ ఒక గ్యాంగ్ స్టర్ మూ ఈమూవీకి తమిళనాడులో మినహా మరెక్కడా క్రేజ్ కనిపించడంలేదు. అయితే ఇదే రోజున విడుదలకాబోతున్న నాని ‘హిట్ 3’ కి మాత్రం ప్రేక్షకులలో మంచి క్రేజ్ రావాడమే కాకుండా ఈమూవీ టిక్కెట్స్ బుక్ మై షో యాప్ లో ఒక వారం రోజులు ముందుగానే అమ్మకం జరిగిపోవదంతి నాని అభిమససణులు మంచి జోష్ లో ఉన్నారు.



దీనికితోడు నాని సినిమాకు టిక్కెట్ల రేట్లు పెంచకుండా ఇప్పటి వరకు కొనసాగుతున్న రేట్లను ‘హిట్ 3’ కి పెట్టదయంలో నానికి ముందు చూపు ఉంది అంటున్నారు. సాధారణయంగా నాని సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈసారి నాని యూత్ ను అదేవిధంగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తనకు ఉన్న న్యాయచరల్ స్టార్ ఇమేజినీ కొనసాగించడానికి ‘హిట్ 3’ తో చేస్తున్న ప్రయోగంతో సూర్య ‘రెట్రో’ కు కష్టాలు తప్పడంలేదు అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: