గ్లోబల్ స్టార్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. స్వయంగా అనౌన్స్ చేసిన రాంచరణ్..!
అఫ్కోర్స్ రాంచరణ్ పై నెగటివ్ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి . కొంతమంది ఆయన గురించి నెగటివ్గా మాట్లాడుతుంటారు . కానీ రామ్ చరణ్ మాత్రం అలాంటివి పెద్దగా పట్టించుకోడు. తన పని తాను చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు . ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యి ఆ సినిమాని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి మూమెంట్లోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని చెప్పిన వీడియో వైరల్ గా మారింది.
తన ఫేవరెట్ హీరో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటూ ఓపెన్ గా చెప్పేసిన రాంచరణ్.. హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించేసరికి కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడుతాడు. అసలు నాకు హీరోయిన్స్ పెద్దగా ఇష్టం లేదు అంటూనే ఈ జనరేషన్ హీరోయిన్ మాత్రం సమంత నాకు బాగా ఇష్టమని.. సమంత నటన బాగా నచ్చుతుంది అంటూ ఓపెన్ అప్ అయ్యాడు. రంగస్థలం సినిమాలో వీళ్లిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది . దీనితో సోషల్ మీడియాలో రామ్ చరణ్ - సమంత ల పేర్లు మరొకసారి ట్రెండ్ అవుతున్నాయి..!