మీటింగ్ కు వెళితే బట్టలు విప్పి కూర్చొమన్నాడు... నటి సంచలనం?

Veldandi Saikiran
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది యాక్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అంద చందాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సీరియల్ నటి నవీనా బోలె ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అనేక సీరియల్స్ సినిమాలలో నటించిన నవీన బోలె బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకుంది. 


సినిమా ఇండస్ట్రీ అంటేనే సాధారణంగా కమిట్మెంట్స్, క్యాస్టింగ్ కౌచ్ లు ఉంటాయని ప్రతి ఒక్కరూ సంచలన కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే నవీన బోలె కూడా బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పైన హాట్ కామెంట్స్ చేశారు. సాజిద్ ఖాన్ ను కలవడానికి 2004-2005 సమయంలో అతని వద్దకు వెళ్లానని ఓ ప్రాజెక్ట్ మీటింగ్ కోసం మాట్లాడడానికి సాజిద్ ఖాన్ వద్దకు వెళ్తే అతను ఎలాంటి వాడో తనకు తెలిసిందని నవీన బోలె అన్నారు. సాజిద్ ఖాన్ వద్దకు వెళ్లగా అతను బట్టలు విప్పి కూర్చోమన్నాడు అని చెప్పింది.


దుస్తులు లేకుండా నా బాడీ ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో చూడాలని సాజిద్ ఖాన్ చెప్పాడు. సాజిద్ ఖాన్ అలా మాట్లాడడంతో ఒక్కసారిగా నాకు ఏమీ అర్థం కాలేదని నవీన తెలిపారు. అంతలోనే నా స్నేహితులు బయట నాకోసం వెయిట్ చేస్తున్నారని, వారు పిలుస్తున్నారని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేసానని నవీన బోలె తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు సాజీద్ ఖాన్ ఫోన్ కాల్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టినట్టుగా నవీన బోలె వెల్లడించారు. ఆరోజు జరిగిన సంఘటన తనను ఎంతో కలిచి వేసిందని, ఇప్పటికే ఆ రోజును నేను ఎప్పుడూ మర్చిపోలేనని నవీన వెల్లడించారు. ప్రస్తుతం నవీన బోలె షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: