బాలీవుడ్
ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో షారుక్ ఖాన్ ,
సల్మాన్ ఖాన్ ,
అమీర్ ఖాన్ ముందు వరసలో ఉంటారు. వీరు ముగ్గురు కూడా ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని
హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే
షారుఖ్ ఖాన్ తమిళ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి
అట్లీ దర్శకత్వంలో రూపొందిన
జవాన్ అనే సినిమాలో
హీరో గా నటించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్నాడు.
ఈ
సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి షారుక్
బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో చేరిపోయింది. ఇకపోతే తాజాగా
సల్మాన్ ఖాన్ తమిళ సినీ పరిశ్రమలలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సికిందర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇకపోతే షారుక్ ,
సల్మాన్ ఫార్ములానే ఆమీర్ ఖాన్ కూడా ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళ్తే ... ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న దర్శకులలో ఒకరు అయినటువంటి
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఆమీర్ ఖాన్ ఓ
మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు , ప్రస్తుతం వీరిద్దరి మధ్య డిస్కషన్స్ నడుస్తున్నట్లు , అన్ని ఒకే అయితే మరి కొంత కాలంలోనే ఆమీర్ ఖాన్ ,
లోకేష్ కనకరాజు కాంబో
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే
లోకేష్ కనకరాజు ప్రస్తుతం
సూపర్ స్టార్ రజనీ కాంత్
హీరో గా కూలీ అనే
మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ
మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.