
హిట్ 3 : నాని చివరి నిమిషంలో ఇలా చేశావేంటి..?
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ హిట్ - 3 ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సీరిస్ లో భాగంగా వచ్చిన హిట్ , హిట్ 2 సినిమా లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు హిట్ 3 సినిమా మీద టాలీవుడ్ లోనూ .. ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ 3 సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందించారు. శైలేష్ కొలను గత యేడాది సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరో గా తెరకెక్కించిన సైంధవ్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా హిట్ 3 మీద భారీ అంచనాలు ఉన్నాయంటే అందుకు ప్రధాన కారణం నాని యే అని చెప్పాలి . నాని ఈ సినిమా మేకింగ్ దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు .. ట్రైలర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. హిట్ 3 క ఈ సినిమాలో నాని చేయబోయే రక్తపాతం ప్రేక్షకులను స్టన్ చేస్తుందని మేకర్స్ ధీమా తో ఉన్నారు. ఇక నాని అయితే నార్త్ ఇండియా లో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నాడు. ఇప్పటికే సెన్సార్ పనులు కూడా ముగించుకున్న హిట్ 3 సినిమాకు క్లైమాక్స్ లో ఇప్పుడు తుది మెరుగులు దిద్దే పనిలో మేకర్స్ బిజీ గా ఉన్నారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంది. అయితే ఈ రన్ టైం ను ఇప్పుడు 5 - 8 నిమిషాలు తగ్గించే పనిలో ఉన్నారట. ఫైనల్ రన్ టైం లాక్ అయ్యాక అసలు కాపీలను థియేటర్లకు పంపుతారట. ఏదేమైనా హిట్ 3 రిలీజ్ కు ముందు కొద్ది గంటల వ్యవధి లో ఇలా ట్రిమ్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు