
ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి తెగ ఇబ్బంది పడ్డ జూనియర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ ఏం చేసాడో తెలుసా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత వార్తలను కూడా సరికొత్తగా ట్రెండ్ చేస్తుంది ఇంటర్నెట్. ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఇలాగే ట్రెండ్ అయ్యాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సీన్ చేయడానికి ఇబ్బంది పడిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటుంది సోషల్ మీడియా. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ వార్తను తెగ ట్రెండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా సింహాద్రి . ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టింది .
ఆయన పర్ఫామెన్స్ .. ఆయన నటన .. ఆయన డ్యాన్సింగ్ స్టైల్.. ఆయన అమాయకత్వం ఈ సినిమాలో బాగా అబ్జర్వ్ చేయొచ్చు . అయితే ఈ సినిమాలో ఒక సీన్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డారట జూనియర్ ఎన్టీఆర్. మరి ముఖ్యంగా భూమికతో అలా ఆ సీను నటించడానికి ఏకంగా మూడు రోజులు పాటు టైం తీసుకున్నారట. సింహాద్రి సినిమాలో అంకిత జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫామెన్స్ కన్నా.. భూమిక జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫామెన్స్ హైలెట్గా మారింది అని చెప్పుకోవడంలో సందేహం లేదు.
వీళ్ళిద్దరి కాంబోలో ఓ సాంగ్ ఉంటుంది. "నన్నేదో చేయమాకు" ఈ సాంగ్ కొరియోగ్రఫీ మూమెంట్లో తారక్ సరదాగా భూమిక నడుము గిల్లాలి.. అయితే మొదటి నుంచి హీరోయిన్స్ తో లిమిటెడ్ గా బిహేవ్ చేసే తారక్ కి ఇది పెద్దగా నచ్చలేదు . కంఫర్టబుల్గా లేదు . ఆఖరికి భూమిక వచ్చి పర్వాలేదు ఆసీన్ చేయమని చెప్పినా కూడా తారక్ వినలేదట. అసలు ఆ సీన్ చేయడానికి మూడు రోజులపాటు నానా తిప్పలు పెట్టారట . ఇక తారక్ ప్రాబ్లం అర్థం చేసుకున్న రాజమౌళి ఆ సాంగ్ లో ఆ మూమెంట్ ని క్యాన్సిల్ చేసేసారట . అంత సిగ్గు గల వ్యక్తి అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు..!