టాలీవుడ్
ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో
నాగ వంశీ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో నిర్మించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఇకపోతే నిర్మాతగా చాలా కాలం నుండి కెరీర్ను కొనసాగిస్తున్న
నాగ వంశీ ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. కొంత కాలం క్రితం
జూనియర్ ఎన్టీఆర్ ,
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను
నాగ వంశీ కొనుగోలు చేసి ఈ
మూవీ ని పెద్ద స్థాయిలో విడుదల చేశాడు. దానితో
నాగ వంశీ కి
తారక్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1
మూవీ ద్వారా పెద్ద ఎత్తున లాభాలు కూడా వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం
జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" అనే
హిందీ సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ
మూవీ యొక్క
థియేటర్ హక్కులను
నాగ వంశీ దక్కించుకున్నాడు అని ఒక వార్త తాజాగా పెద్ద ఎత్తున వైరల్ అయింది.
ఇకపోతే తాజాగా ఈ వార్త పై
నాగ వంశీ స్పందిస్తూ ...
వార్ 2 సంబంధించిన
థియేటర్ హక్కులను నేను దక్కించుకున్నాను అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని ,
వార్ 2
సినిమా హక్కులను నేను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం
నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.