గత కొద్దిరోజుల నుండి రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ డేటింగ్ రూమర్లకు తగ్గట్లుగానే రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలో పెట్టే ఫోటోలకు లింక్ ఉండడంతో వీరి మధ్య ప్రేమ నిజమేనని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు చాలామంది సెలబ్రిటీ కపుల్స్ ప్రేమలో ఉంటే ఇలాగే సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులతో అడ్డంగా దొరికిపోతారు. అలా భాగ్యశ్రీ బోర్సే,రామ్ పోతినేనిలు కూడా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకి వాళ్ళు డేటింగ్ లో ఉన్న విషయాన్ని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు అంటూ మాట్లాడుకుంటున్నారు.ఇదంతా పక్కన పెడితే.. రీసెంట్ గా వీరిద్దరూ సెల్ఫీ ఫొటోస్ షేర్ చేయడంతో డేటింగ్ వార్తలు వినిపించాయి.
అయితే ఈ డేటింగ్ వార్తలపై స్పందించిన భాగ్యశ్రీ బోర్సే అలాంటిదేమీ లేదు.. కలిసి సినిమాలో నటిస్తే ప్రేమ ఉన్నట్టేనా అని డేటింగ్ వార్తలను ఖండించింది. కానీ తాజాగా ఇది నిజమే అంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్ లుగా మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న #Rapo22 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అన్ని అప్డేట్స్ కూడా ప్రేక్షకులకు మంచి కిక్కిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ పోతినేని గడ్డాలు, మీసాలు తీసేసి యంగ్ లుక్ లోకి మారిపోయారు.అయితే తాజాగా రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే కోసం ఓ పాట రాసి పాటల రచయితగా మారారనే రూమర్లు టాలీవుడ్ మీడియాలో ఊపందుకున్నాయి.. అయితే రామ్ పోతినేని రాసిన ఈ పాట మే 15న ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇన్ని రోజులు లేంది రామ్ పోతినేని స్వయంగా ఓ పాట రాసారంటే కచ్చితంగా అది భాగ్యశ్రీ కోసమేనని, వీరిద్దరి మధ్య ప్రేమ నిజమే అంటూ మళ్ళీ రూమర్లు వినిపిస్తున్నాయి.