రాజమౌళి తర్వాత ఆ డైరెక్టర్‌తో మహేష్ సినిమా ఫిక్స్ .. !
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో SSMB 29 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పని లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. సినిమా కు కాస్త విరామం ఇస్తున్నట్టు రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని తెలుగు సినీ అభిమాను లతో పాటు అటు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కావడానికి ఎలా ఏదన్నా మరో రెండేళ్ల టైం పట్టవచ్చు.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తర్వాత సినిమా ను ఏ డైరెక్టర్‌తో చేస్తాడు ? అనే దానిపై చర్చ నడుస్తోంది. దీనిపై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్త వచ్చింది. గతంలో బుచ్చిబాబు ని కలిసిన మహేష్ ఏదైనా కథ ఉంటే చేద్దామని ఆయనకు మాట ఇచ్చాడట. దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమా చేస్తోన్న బుచ్చిబాబు తర్వాత మహేష్ ను లైన్లో పెట్టడం ఖాయమన్న టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు