మొదటి ప్రయత్నంలో విజయం సాధించబోతున్న సమంత !
ఇలాంటి పరిస్థితులలో ఆమె నిర్మాతగా మారి చిన్న సినిమాలను తీయాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ‘శుభం’ మూవీ. అంతా కొత్త నటీనటులతో నిర్మించిన ఈమూవీలో సమంత ఒక అతిధి పాత్రలో కనిపించబోతోంది. యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ చాల తక్కువ పెట్టుబడితో తీసినట్లు తెలుస్తోంది.
ఈసినిమా ప్రమోషన్ ను అంతా తానై సమంత అంతానై చూసుకుంటోంది. ఈమూవీ టీజర్ ను చాల వెరైటీగా కట్ చేయడంతో ఈమూవీ పై కొద్దికొద్దిగా అంచనాలు పెరుగుతున్నాయి. కామెడీ హర్రర్ థ్రిల్లర్ గా ఈమూవీ కథ ఉంటుంది అని అంటున్నారు. టీవి సీరియల్స్ ప ఉన్న పిచ్చితో చనిపోయిన తరువాత దెయ్యాలుగా మారిన ఇద్ధరు మహిళలు చుట్టూ ఈమూవీ కథ ఉంటుంది అన్న లీకులు వస్తున్నాయి.
ఈ మూవీతో పోటీగా శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమా ఉన్నప్పటికీ ఆపోటీని లెక్కచేయకుండా సమంత తన చిన్న సినిమా పై ఉన్న ధైర్యంతో విడుదలకు ముందే వేసిన ప్రీమియర్ షోలకు పాజిటివ్ టాక్ రావడంతో సమంత ఈ సినిమా ప్రమోషన్ విషయంలో వేగాన్ని పెంచింది. సమంతకు బాలీవుడ్ లో ఉన్న పరిచయాల రీత్యా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకు ముందుగానే అమ్మినట్లు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమా కావడంతో కేవలం మొదటి మూడు రోజులు ప్రేక్షకులు ధియేటర్లకు వస్తే సమంత నిర్మాతగా తన తొలి విజయం సాధించినట్లే అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..