శుభం సినిమాకి నష్టాలు లేకుండా సమంత సూపర్ ప్లాన్..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నిర్మాతగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే గతంలో యూటర్ అనే చిత్రాన్ని కూడా చేసిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ శుభం సినిమాతో నిర్మాతగా మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది సమంత. మే 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ కామెడీ త్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ సినిమా బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్లో తెరకెక్కించారు. దాదాపుగా ఈ సినిమా ధియేటర్ రైట్స్ క్లోజ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


జి గ్రూప్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సైతం దక్కించుకున్నది.. నెట్ ఫ్లిక్స్ ఓటిటి డీల్ కూడా ఒక కోలికి వచ్చినట్లు తెలుస్తోంది. శుభం సినిమా ప్రాఫిట్ సొంతం చేసుకునేలా టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే శుభం సినిమా నిర్మాతగా మొదటి సక్సెస్ అందుకున్నట్లే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథ 2004 లో భీమునిపట్నం నేపథ్యంలో సాగబోతోందట. ముగ్గురు స్నేహితుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అలాగే వారి భార్యలు టీవీ సీరియల్ ఆడక్ట్ అయ్యి  ఆ తర్వాతవారు ఎలా ప్రవర్తించారో అనే కథాఅంశంతో తెరకెక్కించారు.


ఈరోజున హైదరాబాదులో మూడు థియేటర్లలో శుభం ఫైర్ ప్రీమియం షోలు కూడా వేసినట్లు తెలుస్తోంది. మొదటి షో హౌస్ ఫుల్ దూసుకుపోతుందట. రెస్పాన్స్ కూడా భారీగానే వస్తోందట. ఇది చూస్తూ ఉంటే మరికొన్ని థియేటర్లలో కూడా ప్రీమియర్ షోలు పడేలా ఉన్నాయి. వచ్చిన ఆడియన్స్ నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ తెలియజేస్తున్నారట. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి లక్ష్మి, వంశీధర్ గౌడ్ తదితరులు నటిస్తూ ఉన్నారు. మరి ఏ మేరకు సమంత శుభం సినిమాతో లాభాలను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: