తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన కొంత కాలం క్రితం ఓం భీమ్ బుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శ్రీ విష్ణు "స్వాగ్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాలో హీరో గా నటించాడు.
ఈ మూవీ ఈ రోజు అనగా మే 9 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగినట్లు తెలుస్తోంది. మరి శ్రీ విష్ణు హీరో గా రూపొందిన సింగిల్ మూవీ కి ఏ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతోంది అనే వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సింగిల్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 6.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
దానితో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ఓం భీమ్ బుష్ మూవీ కి 9.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... స్వాగ్ మూవీ కి 7 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా శ్రీ విష్ణు ఆఖరిగా నటించిన మూడు మూవీలకు కూడా సింగిల్ డిజిట్ లోనే ఫ్రీ రిలీజ్ బిజినెస్లు జరిగాయి.