
టాలీవుడ్ పై కూటమి మార్క్ : ఇక అలా బతిమిలాడుకోవటం బంద్..!
అయితే దీని పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .. ప్రస్తుతం వేసిన కమిటీ ద్వారా టికెట్ రేట్ ఎంత ఉండాలి ? అనే విషయంపై నిర్మాతల అభిప్రాయం తీసుకుని ఓ నిర్దిష్టమైన విధానాన్ని అమలు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన .. చిన్న మీడియం పెద్ద సినిమాలకు బడ్జెట్లని బట్టి తొలి మూడు వారాలు టికెట్ రేట్లు పెంపుపై ఆలోచన చేస్తారు .. ఇవే తర్వాత అమలవుతాయి .. ఇక గతంలో జగన్ ప్రభుత్వం హయాంలో నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు .. అగ్ర హీరోల సినిమాలకు టికెట్ రేట్లు బాగా తగ్గించేసి నిర్మాతల ఆదాయానికి భారీగా బొక్క పెట్టే ప్రయత్నం చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం .. అలాగే ఆ సమయంలో టిక్కెట్ రేట్లు పై ప్రభుత్వం పెత్తనం ఏమిటని చాలామంది ప్రశ్నించారు కూడా పవన్ కళ్యాణ్ సైతం అప్పట్లో జగన్ విధానాలపై పోరాడారు ..
ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది నిర్మాతల కష్టాలని అర్థం చేసుకొని వాళ్ళ అభీష్టం మేరకు కొత్త చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది .. అయితే ఇప్పుడు అందులో భాగంగానే ఈ కమిటీ ఏర్పాటయింది .. ఇక త్వరలోనే నిర్మాతలతో ఈ కమిటీ సభ్యులు సమావేశమై వారి విన్నపాలను , సలహాలను స్వీకరిస్తారు .. ఇక తర్వాత ప్రభుత్వానికి ఓ నివేదిక అందిస్తారు .. ఇక ఆ తర్వాత గవర్నమెంట్ టికెట్ రేట్ల పై ఓ స్పష్టమైన నిర్ణయం ఇస్తుంది .. ఇలాంటి ప్రయత్నమే తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది .. టిక్కెట్ రేట్లు పెంచమని ప్రతిసారి ప్రభుత్వాన్ని మొరపెట్టుకొని జీవాల కోసం ఎదురు చేసే బాధ కూడా నిర్మాతలకు తప్పుతుంది ..