
ఓరుగల్లు ఒడిలో పట్టు పరికిణిలో తెలుగు అందంతో మెరిసిపోతున్న .. అందాల తారలు..!
అచ్చం తెలుగింటి అమ్మాయిల రెడీ అయి తెలుగుదనం ఉట్టిపడేలా నుదుటున బొట్టు సిగ లో పూల తో అందంగా ముస్తాబయ్యారు .. మొత్తంగా 57 మంది మిస్ వరల్డ్ బ్యూటీలు రెండు గ్రూపులు గా వరంగల్ జిల్లా లో సందడి చేస్తున్నారు .. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ బ్యూటీలకు స్వాగతం పలికారు .. డోలు బతుకమ్మలతో వీరిని వరంగల్ జిల్లాలోకి ఆహ్వానించారు అదేవిధంగా ఈ ముద్దుగుమ్మలు బతుకమ్మ వద్ద డాన్సులు చేయటమే కాకుండా డోలు చపుడుకు డాన్సులు చేస్తూ సందడి చేశారు ..
ముందుగా వీరు 1000 స్తంభాల గుడి కి వెళ్లి అక్కడ నందీశ్వరుడికి పూజలు చేశారు .. అలాగే శివలింగానికి అభిషేకం చేసి నమశ్శివాయ అంటూ ఆ భగవంతున్ని ప్రార్థించి గుడిలో సెల్ఫీలకు దిగారు .అంతేకాకుండా తర్వాత భద్రకాళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారు .. ఆ తర్వాత రామప్ప ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయ విశిష్టత కాకతీయుల చరిత్ర గురించి ఎన్నో విషయాలు వీరు తెలుసుకున్నారు .అంతేకాకుండా ఈ అందాల ముద్దుగుమ్మలు వరంగల్ కోట ఈ జిల్లాలోని అనేక పర్యాటక ప్రాంతాల ను సందర్శించారు .. ప్రస్తుతం వీరి కి సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియా లో భారీ స్థాయి లో ట్రెండ్ అవుతున్నాయి ..