
బాలయ్య అఖండ 2ను షిఫ్ట్ చేస్తున్నారా... !
నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 సినిమా స్పీడ్‌గా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న అఖండ 2 సినిమాను ఈ సారి పాన్ ఇండియా లెవల్లో తాండవం చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కాగా.. ఆ సినిమాను హిందీ లో డబ్బింగ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అఖండ 2 సినిమాను డైరెక్టుగా హిందీలో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పుడు అఖండ 2 దసరా కు రావడం కష్టమే అని తెలుస్తోంది. దసరా నాటికి షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తవుతాయా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అఖండ 2 సినిమాకు సీజీ వర్క్ చాలా ఎక్కువుగా ఉంటుందట. వీఎఫ్ ఎక్స్ వర్క్ పర్‌ఫెక్ట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే సినిమా కాస్త లేట్ అయినా పర్వాలేదు అన్న ఆలోచనలో బోయపాటి ఉన్నాడంటున్నారు. అయితే దసరా కు అనుకున్న సినిమా కాస్తా లేట్ అయ్యి డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదా క్రిస్మస్‌కు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అఖండ ఎలాగూ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే రిలీజ్ అయ్యింది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు డిసెంబర్ లోనే అఖండ 2 తాండవం రిలీజ్ అనుకుంటున్నారట. అఖండ 2 తాండవం సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో చేసే సినిమాను కూడా బాలయ్య పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు