దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె, బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్ గురించి పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్లతో సినిమాల్లోకి రాక ముందు నుంచే ఖుషీ కపూర్ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2023లో `ది ఆర్చీస్` అనే హిందీ చిత్రంతో ఈ స్టార్ కిడ్ తన ఫిల్మ్ కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత `లవ్‌యాపా`, `నదానియన్` సినిమాలతో నార్త్ ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. దురదృష్టం ఏంటంటే.. ఖుషీ కపూర్ నటించి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
వరుస ఫ్లాపులతో తీవ్ర నిరాశకు గురైన ఖుషీ పాప.. ఎలాగైనా కెరీర్ ను గాడిలో పెట్టుకునేందకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఖుషీ కాపూర్.. తాజాగా ఇన్‌స్టా వేదికగా బికినీలో బీచ్ అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను పంచుకుంది. ప్రతి సంవత్సరం అక్క జాన్వీ కపూర్ తో మల్దీవులను చుట్టొచ్చే ఖుషీ.. ఈ సారి ఓరీ అలియాస్ ఓర్హాన్ అవత్రమనితో కలిసి బీచ్ వెకేషన్ కు వెళ్లింది.
అక్కడ ఖుషీ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసింది. బికినీలో కవ్విస్తున్న ఖుషీ కపూర్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అర్థనగ్నంగా ఖుషీ కపూర్ ను చూసి కుర్రొళ్లు కిర్రెక్కిపోతుండగా.. మరోవైపు నెటిజన్లు మాత్రం అందాలు ఆరబోయడంలో అక్కనే మించిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు