సినిమాల్లో నటించేవారికి చాలా ఆస్తులు ఉంటాయని, లగ్జరీ జీవితాన్ని గడుపుతారని చాలా మంది అనుకుంటారు . కానీ సినిమాల్లో నటించేవారిలో చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఎదురుకునేవారే ఉంటారు . హీరోలు , హీరోయిన్లు లగ్జరీ జీవితాన్ని గడుపుతూ కోట్లల్లో సంపాదిస్తుంటారు కానీ సైడ్ క్యారెక్టర్లు చేసే నటులు , క్యారెక్టర్ ఆర్టిస్టులకు పెద్దగా రెమ్యురేషన్లు ఉండవు. అంతే కాకుండా ఒక సినిమాలో నటించిన తరవాత మరో సినిమాలో అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. అలాంటి వారికి చిన్న కష్టం వస్తేనే అల్లాడిపోతుంటారు .
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన బలగం సినిమా నటుడి పరిస్థితి కూడా అలాగే ఉంది . బలగం సినిమాలో నటించి ఎంతో గుర్తింపు సంపాదించినా అతడి కుటుంబం మాత్రం వైద్యం కోసం మందులు కూడా కొనలేని స్థితిలో ఉంది. బలగం సినిమాలో జీవీ బాబు హీరో ప్రియదర్శికి చిన్నతాత పాత్రలో అంజన్నగా నటించాడు. సినిమాలో అంజన్న పాత్ర కీలకం. హీరోకు, అతడి ఫ్యామిలీకి ఫ్లాష్ బ్యాక్ చెప్పి కథను మలుపు తిప్పే పాత్ర. బలగం సినిమాలో నటించిన వారు అంతా తమ సహజ నటనతో మెప్పించగా అంజన్న కూడా తన అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరుస్తాడు .
అంజయ్య ప్రాత్రకు ప్రాణం పోశాడు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉండగా రెండు కిడ్నీలు చెడిపోవడంతో పరిస్థితి విషమించింది. కడ్నీలు చెడిపోవడంతో పాటూ గొంతు ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే జీవీ బాబు పరిస్థితి గురించి తెలుసుకున్న హీరో ప్రియదర్శి , డైరెక్టర్ వైణు తమకు తోచిన సహాయం చేశారు . అయినప్పటికీ ఆ డబ్బు సరిపోలేదని తమను దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని బాబు కుటుంబ సభ్యులు కోరుతున్నారు .