ఎట్టకేలకు స్వయంభు నుండి చిన్న అప్డేట్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నిఖిల్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ అనే మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన వరుస పెట్టి అనేక సినిమాలో నటించాడు. కానీ ఆ తర్వాత ఈయనకు చాలా కాలం పాటు హ్యాపీ డేస్ స్థాయి విజయం దక్కలేదు. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది. అలాంటి సమయంలో ఈయన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో మళ్లీ ఈయన ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.


ఇక స్వామి రారా సినిమా తర్వాత ఈయన అచి తూచి కథలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తూ రావడంతో ఈయనకు స్వామి రారా మూవీ దగ్గర నుండి చాలా విజయాలు దక్కాయి. దాంతో ప్రస్తుతం ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిఖిల్ "స్వయంభు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్లు ఏవి పెద్దగా బయటకు రాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.


అసలు విషయం లోకి వెళితే ... జూన్ 1 వ తేదీన నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యొక్క టీజర్ను విడుదల చేసే సన్నాహాలను ఈ మూవీ బృందం చేస్తున్నట్లు అన్ని సెట్ అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: