తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొన్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వాతావరణం గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి బన్నీ వాసు స్పందించాడు. తాజాగా బన్నీ వాసు ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల గురించి స్పందిస్తూ ... సినిమా పరిశ్రమలో రాజకీయాలు అత్యంత సైలెంట్ గా మరియు చాలా లోతుగా ఉంటాయి అని బన్నీ వాసు తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలిగిపోతుంది.
ఇప్పటికైనా ఆ విషయాన్ని ప్రొడ్యూసర్లు , డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు గ్రహించాలి అని ఆయన కోరారు. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పని చేస్తున్న పవన్ కళ్యాణ్ ని కూడా మనం ఎంత ఇరిటేట్ చేసామంటే మన యూనిటీ ఎలా ఉందనేది ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది అని ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి బన్నీ వాసు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే బన్నీ వాసు కొంత కాలం క్రితం నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండల్ అనే భారీ బడ్జెట్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితం విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే బన్నీ వాసు ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.