మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతూ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ఆ హీరోయిన్ తొడలపై కామెంట్లు చేయడంతో చాలామంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ మంచు విష్ణు ఏ హీరోయిన్ తొడలపై కామెంట్లు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్పలో భారీ తారాగణం నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్,మోహన్ లాల్, కాజల్,మోహన్ బాబు, శరత్ కుమార్,ప్రభాస్ ఇలా భారీ తారాగణం ఉన్నారు.అయితే మంచు విష్ణు శివుడికి పరమ భక్తుడైనటువంటి కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. ఇక మంచు విష్ణు సరసన హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటిస్తుంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి ప్రీతి ముకుందన్ పై మంచు విష్ణు మాట్లాడుతూ.. నేను కన్నప్ప సినిమా షూటింగ్ 104 కిలోలు ఉన్నాను. ఇక నా పక్కన హీరోయిన్ గా చేసిన అమ్మాయి చాలా స్లిమ్ గా ఉంది. కన్నప్ప షూటింగ్ చేస్తున్నప్పుడు నా ఆమ్ దాదాపు 21 ఇంచెస్.. కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ బిజీలో పడి 80 కిలోలు అయ్యాను. అన్ని కిలోలు తగ్గిపోయాను. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉండి జిమ్ చేయడం కుదరలేదు.అందుకే 80 కిలోలకి వచ్చాను. అయితే అంత బరువు మెయింటైన్ చేయడం కూడా కష్టమే. ఎప్పుడు అలా ఉండాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని.ఇక మా సినిమాలో హీరోయిన్గా చేసిన ప్రీతి ముకుందన్ తొడ నా చేతు అంత ఉంటుంది. ఇక ఈ విషయం గురించి బ్రహ్మానందం గారు ప్రతిసారి కామెంట్ చేసేవారు.
ఆ హీరోయిన్ తొడా నీ చేతు అంత ఉంది అని నవ్వులు పూయించేవారు. ఇక అంత బాడీని మెయింటైన్ చేయాలంటే వర్కౌట్స్ అవసరం. కాబట్టి ప్రమోషన్స్ బిజీలో పడి వర్కౌట్స్ మానేశాను. ఇక బాహుబలి మూవీలో ప్రభాస్,రానా పెంచిన బాడీ గుర్తుకొస్తుంది. కన్నప్ప మూవీ కోసం నేను కూడా అలాగే చేశాను అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అయితే అంతే బాగానే ఉన్నప్పటికీ ప్రీతి ముకుందన్ తొడ నా చేతు అంత ఉంటుంది అని విష్ణు కామెంట్స్ చేయడంతో కొంతమంది నెటిజన్లు షూటింగ్ సెట్లో ఆమె తొడలు చూస్తూనే ఉన్నావా? నీ చేతు అంత ఉంది అని మాట్లాడుతున్నావ్.. అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు.కానీ కొంతమంది మాత్రం ఇందులో కూడా తప్పును వెతుకుతున్నారు