ఆ స్టార్ హీరో ఫోన్ నెంబర్ లీక్ చేసిన మనోజ్.. ఇంత దూల ఏంటయ్య నీకు!
అయితే ఈవెంట్లో భాగంగా మనోజ్ లైవ్ లోనే తమిళ స్టార్ హీరో శింబుకి ఫోన్ చేశాడు. మనోజ్ ఫోన్లో వాయిస్ సరిగ్గా వినిపించకపోవడంతో.. హీరోయిన్ అదితి శంకర్ ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. మనోజ్-శింబు మధ్య సరదా సంభాషణ జరిగింది. `కమల్ హాసన్ సార్ తో నటించావు.. నిన్ను చూస్తే జలసీగా ఉంది.. థగ్ లైఫ్ కు ఆల్ ది బెస్ట్ మచ్చా..` అని మనోజ్ చెప్పగా.. అందుకు శింబు `థాంక్స్.. అలాగే మనోజ్ గురించి ఒక విషయం చెప్పాలి. మనోజ్ చిన్నపిల్లాడి లాంటివాడు. మనం ప్రేమిస్తే తిరిగి అంతకుమించిన ప్రేమను చూపిస్తాడు. అదే ద్వేషిస్తే అతనితో మనకే రిస్క్` అని చెప్పి అందరినీ నవ్వించాడు.
అయితే ఈ సంభాషణ అంతా బాగానే ఉంది. కానీ మనోజ్ అనుకోకుండా శింబు ఫోన్ నెంబర్ బయటకు కనిపించేలా పెట్టి మాట్లాడాడు. ఈ విషయాన్ని గుర్తించిన యాంకర్ సుమ.. వెంటనే ఫోన్ అటుగా తిప్పింది. దాంతో మనోజ్ `మచ్చా ఫోన్ నెంబర్ లీక్ అయినట్టుగా ఉంది.. మీకు కొత్త సిమ్ పంపిస్తాలే` అంటూ నవ్వేశాడు. అందుకు శింబు `అయ్యయ్యో..` అంటూ ఒకింత షాక్ అయ్యాడు. ఇక ఇదే విషయంపై సుమ.. `మనోజ్ ప్రేమను మాత్రమే కాదు ఆయన నెంబర్‌ను కూడా అందరికీ ఇచ్చేశారు` అంటూ కౌంటర్ వేసింది. మొత్తానికి శింబు ఫోన్ నెంబర్ లీక్ అవ్వడంతో.. ఇంత దూల ఏంటయ్య నీకు అంటూ నెటిజన్లు సైతం సరదాగా మనోజ్‌పై సెటైర్లు పేలుస్తున్నారు.