టాలీవుడ్లో ఎవ్వరికి తెలియని మాఫియా... పవన్ ఉక్కుపాదంతో అణుస్తాడా...!
రిటర్న్ గిఫ్ట్ కి థాంక్స్ అంటూ పవన్ కళ్యాణ్ పంపిన సందేశం టాలీవుడ్ లో ఇప్పుడు ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. మీడియాలోనూ అటు టాలీవుడ్ లోను ఎక్కడ చూసినా ఇదే హాట్ డిస్కషన్ గా నడుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు అన్యాయం జరిగింది.. అగౌరవం ఎదురయింది అని టాలీవుడ్ వాళ్లు లోలోపల కుమిలిపోయారు. అప్పుడు నిర్మాతలు తరఫున పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నా సినిమా ఆపుకోండి మిగిలిన వాళ్ళని వదిలేయండి అనే స్టేట్మెంట్ నుంచి తన తెగింపు, త్యాగం నిరూపించుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి టాలీవుడ్ లో మాఫియాలో ప్రముఖులుగా పేరు తెచ్చుకున్న ఆ నలుగురు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వచ్చేసాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఆడిన ఈ థియేటర్ల బంద్ నాటకం పవన్ కి తిక్క రేగిలా చేసింది. ఇప్పుడు పవన్ అందరి లెక్కలు బయటకు తీయడానికి రెడీ అవుతున్నారు.
థియేటర్లో బందు వెనక ఓ పెద్ద స్కాం ఉంది అనేది నూటికి నూరుపాళ్ళు నిజం. పైగా థియేటర్ వ్యవస్థని కాపాడటానికి థియేటర్ యజమానుల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నాం అని చెబుతున్నారు.. కానీ వాస్తవానికి ఈ థియేటర్లో అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయి.. పర్సంటేజీ విధానం అమలు చేస్తే ఎవరికి లాభం అనే విషయాలు తెలిస్తే ఈ కుట్ర దారులు ఎవరో అర్థమవుతుంది ? ఏపీ - తెలంగాణలో ఉన్న థియేటర్లలో
సగానికి పైగా ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిన నిజం. ఏ థియేటర్లో ఏ సినిమాను ఆడించాలి అనేది వీళ్లు డిసైడ్ చేస్తారు ? వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ఇప్పుడు థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేస్తే ఈ నలుగురికే లాభం తప్ప అటు నిర్మాతలకు.. ఇటు నిజమైన ఎగ్జిబిటర్లు ఎవరికి రూపాయి లాభం రాదు. అందుకే వీళ్ళు ఈ తతంగం అంత తెరవెనక ఉండి నడిపించారు. అయితే యాక్టివ్ నిర్మాణ సంస్థలలో ముఖ్యమైనవి ఆయన మైత్రి మూవీస్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - వైజయంతి లాంటి పెద్ద సంస్థలు వీటిని వ్యతిరేకించాయి. దీంతో అసలు గొడవ మొదలైంది. చివరకు పవన్ సినిమానే ఇబ్బంది పెట్టేలా వీరు ఆడిన గేమ్‌కు వీరే బలయ్యారు. పవన్ భవిష్యత్తులో వీళ్ల సంగతి చూస్తాడనే అందరూ భావిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు