మహేష్ , రాజమౌళి మూవీలో మరో హీరోయిన్.. ఎవరు ఎక్కడ తగ్గట్లేదుగా..!

Amruth kumar
దర్శక ధీరుడు రాజమౌళి , మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్టైల్ లో తీసుకురాబోతున్నారు .. ఈ సినిమాల్లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది .. అయితే ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ గట్టి గా వినిపిస్తుంది .. అయితే ఈ సినిమాల్లో ఒకీలా ఒక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ   శ్రద్ధా కపూర్ ను తీసుకొనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తుంది .. అలాగే ఆమె పాత్ర స్టోరీ కి అనుగుణంగా సెకండ్ హాఫ్ లో కూడా వస్తుందని టాక్ వినిపిస్తుంది .. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజముంది అనేది తెలియాలి .. ఇక ఏది ఏమైనా పాన్ ఇండియా మూవీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ..

ఇదే క్రమంలో  రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం అందుకే ఆయన పుస్తకాలు ఆధారం గానే ఈ సినిమా రెడీ చేసామంటూ చెప్పుకొచ్చారు .. కాబట్టి రాజమౌళి , మహేష్ సినిమా కూడా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది .. అలాగే ఈ సినిమా కి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు .. ఇక విజయేంద్రప్రసాద్ కథ‌ ఇవ్వగా .. మరో అగ్ర దర్శకుడు దేవా కట్ట ఈ సినిమా కు మాటలు అందిస్తున్నారు ..

ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: