కన్నప్ప టోటల్ రన్ టైం అదే.. ప్రభాస్.. మోహన్ లాల్ కనిపించేది అన్ని నిమిషాలు.. మంచు విష్ణు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తిం పు సంపాదించుకున్న నదులలో మంచు విష్ణు ఒకరు . కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారు డి గా తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు ఇప్పటివరకు చాలా సినిమా ల తో ప్రేక్షకులను పలకరించాడు. అందులో కొన్ని సినిమా లు మంచి విజయాలను కూడా అందుకున్నాయి . కానీ ఈ మధ్య కాలం లో మాత్రం విష్ణు నటించిన చాలా సినిమా లు బాక్సా ఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తు తం విష్ణు "కన్నప్ప" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.


ఈ మూవీ లో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న ఎంతో మంది నటి నటులు కనిపించబోతున్నారు. ఇకపోతే తాజాగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా కన్నప్ప సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వివరాలను విష్ణు తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విష్ణు మాట్లాడుతూ ... కన్నప్ప సినిమాకు సంబంధించిన రన్ టైమ్ 3 గంటల 10 నిమిషాలు వచ్చింది. సినిమా రన్ టైం ఎక్కువ అయినా కూడా అందులో ఎక్కడ కట్ చేయవలసిన సన్నివేశాలు లేవు.


అలాగే సినిమా 3 గంటల 10 నిమిషాలు అయినా ఎక్కడ బోర్ కొట్టే విధంగా లేదు. సినిమా చూసిన తర్వాత మేము ఈ సినిమా ఎవరికి బోర్ కొట్టదు ఇందులోని సన్నివేశాలు తొలగించాల్సిన అవసరం లేదు అని నిర్ణయానికి వచ్చాకే ఆ సినిమాను అలా భారీ రన్ టైం తో ఉంచాం అని విష్ణు చెప్పారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర 30 నిమిషాలు ఉండనున్నట్లు , మోహన్ లాల్ పాత్ర 15 నిమిషాలు ఉండనున్నట్లు కూడా విష్ణు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: