వార్నీ..అప్పుడే మళ్ళీ మరో బిజినెస్..సందీప్ కిషన్ నెలకు అన్ని కోట్లు సంపాదిస్తున్నాడా..?

Thota Jaya Madhuri
సాధారణంగా జనాలు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కాలేకపోతే ఆ హీరో లేదా హీరోయిన్ లైఫ్ ఢమాల్ అని పడిపోతుందని.. వాళ్ళకి ఇన్కమ్ ఉండదని .. ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అని..  చాలా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు . అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసాడు సందీప్ కిషన్ . ఒకే ఒక్క దెబ్బతో ఆయనకు కోట్ల లాభాలు వచ్చేలా చేసేసుకున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరో .



"స్నేహగీతం" అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఇంకో సక్సెస్ అందుకుని.. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా కొనసాగుతూ వచ్చాడు . తెలుగు - తమిళం - హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు . అయితే హీరోగా అనుకున్నంత స్థాయి రిచ్ కాలేకపోయినా సందీప్ ..బిజినెస్ ప్రకారం మాత్రం వేరే లెవెల్లో దున్నేస్తున్నాడు . వచ్చిన కొద్ది డబ్బులనే బిజినెస్ లల్లో పెట్టుబడులుగా పెట్టి దాని ద్వారా లాభాలు అందుకుంటున్న సందీప్ కిషన్ .."వివాహ భోజనంబు" అనే పేరిట ఒక రెస్టారెంట్ ప్రారంభించారు .



అది సూపర్ సక్సెస్ అయింది . ఇప్పుడు హైదరాబాద్ అంతటా బ్రాంచెస్ ఓపెన్ చేసి ఫుల్ లాభాలను అందుకుంటున్నాడు సందీప్ కిషన్ . అంతే కాదు ఇప్పుడు తాజాగా మరొక బిజినెస్ ని కూడా ప్రారంభించాడు . సెల్యూట్ వ్యాపారం లోకి ఎంట్రీ ఇచ్చాడు సందీప్ కిషన్ . విజయవాడలో ఎక్స్ప్రెస్ అనే పేరుతో సెలూన్ ప్రారంభించాడు . అక్కడ సక్సెస్ అయితే మాత్రం రాజమండ్రి - విజయవాడ - కాకినాడ - వైజాగ్ లాంటి ప్రధాన నగరాలలో కూడా సందీప్ ఈ సెల్యూన్ ని ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాడట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సందీప్ కిషన్ బిజినెస్ ద్వారానే కోట్లకు కోట్లు సంపాదించేస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి . ప్రస్తుతం సినిమాల్లో కన్నా కూడా రెస్టారెంట్ బిజినెస్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నాడు సందీప్ కిషన్ అంటూ తెగ వార్తలు వినిపించేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: