తమిళ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈయనకు తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఉంది. అలాగే తమిళనాడులో ఈయనకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ఈయన నటించిన సినిమాలను ఈ మధ్య కాలంలో వరుస పెట్టి రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. కొంత కాలం క్రితం ఈయన నటించిన గిల్లి అనే మూవీ ని రీ రిలీజ్ చేయగా ఆ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ రికార్డులను సృష్టించింది.
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. రీ రిలీజ్ లో భాగంగా మన తెలుగు సినిమాలు కూడా మంచి కలెక్షన్లను రాబడుతున్న గిల్లి సినిమా రికార్డుల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేక పోతున్నాయి. ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం ఖలేజా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని మే 30వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఖలేజా మూవీ ఫ్రీ బుకింగ్ విషయంలో గిల్లి మూవీ ని క్రాస్ చేసేసింది.
ఇక టోటల్ కలెక్షన్ల విషయంలో కూడా గిల్లి మూవీ రికార్డులను ఖలేజా మూవీ దాటేస్తుంది అని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఖలేజా మూవీ గిల్లి మూవీ రికార్డులను లేపేస్తే మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.