అఫీషియల్ : మీరాయ్ టీజర్ విడుదల తేదీ వచ్చేసింది.. తేజ మరో హిట్ కొట్టేలానే ఉన్నాడే..?

Pulgam Srinivas
ప్రముఖ టాలీవుడ్ నటుడు తేజ సజ్జా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తేజ సినిమాలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన హీరోగా నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఆఖరుగా తేజ , ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.


ఈ సినిమా ద్వారా తేజ కు ఇండియా వ్యాప్తంగా గుర్తుకు వచ్చింది. హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత తేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా యొక్క టీజర్ ను మే 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు   ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
 


ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దానితో ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంటుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: