కందుల దుర్గేష్: నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు..వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాం..!
సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది చాలా స్పష్టమైన వైఖరి అని కూడా తెలియజేశారు. రాష్ట్ర పర్యటన రంగం, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయని తెలిపారు. సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది చాలా నిజము త్వరలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొత్త పాలసీని తీసుకు వస్తున్నామంటూ.. సినీ ఇండస్ట్రీ వారితో చర్చించడానికి కూడా తామసిద్దంగానే ఉన్నాము.. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం చాలా సహాయం చేసింది అంటు తెలిపారు.
ప్రతిసారి సినిమాలకు టికెట్లు పెంచామని ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఆ వెంటనే కోర్టులో పిల్ వంటివి వేస్తూ ఉన్నారు.. అయినా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ సినీ ఇండస్ట్రీని అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామంటూ తెలిపారు. తెలుగు సినీ పెద్దలు ఏపీ గవర్నమెంట్ ని కలుస్తారా లేదా అన్నది వారి యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ..మమ్మల్ని కలవలేదని ఏ రోజు కూడా నిర్మాతలని తాము ఇబ్బంది పెట్టలేదంటూ తెలిపారు. సినిమా టికెట్ల విషయంలో శాశ్వత విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతోంది అంటూ తెలిపారు. ఈ వ్యవహారం వైసిపి పార్టీకి లబ్ధి పొందేలా చూస్తోంది అంటూ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు.