దీపికను తప్పించడం వెనుక అసలు కథ ఇదే.. సందీప్ పోస్ట్ తో క్లారిటీ వచ్చేసిందిగా!
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా పోస్ట్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అయింది. అర్ధరాత్రి సమయంలో సందీప్ రెడ్డి వంగా చేసిన పోస్ట్ తో చాలా ప్రశ్నలకు సమాధానం దొరికేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో దీపికా పదుకొనే స్థానంలో త్రిప్తీ దిమ్రీ ఎంపికైన సంగతి తెలిసిందే. తాను ఒక ఆర్టిస్టుకు కథ చెప్పానంటే పూర్తి నమ్మకంతో మాత్రమే ఆ పని చేస్తానని తెలిపారు.
కానీ నేను చెప్పిన కథను బయటపెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావం ఎలాంటిదో చెప్పేశారని ఆమె అన్నారు. నా కథను లీక్ చేయడంతో పాటు ఒక యంగ్ యాక్టర్ గురించి తక్కువ చేశారని సందీప్ కామెంట్లు చేశారు. ఒక సినిమా కొరకు సంవత్సరాల తరబడి కష్టపడతామని తన దృష్టిలో అన్నీ ఫిల్మ్ మేకింగేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలు ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం కావని సందీప్ రెడ్డి వంగా కామెంట్లు చేశారు.
తన సినిమా కథ మొత్తం బయటపెట్టినా తనకు ఎలాంటి నష్టం లేదని సందీప్ రెడ్డి పేర్కొన్నారు. డర్టీ పీఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను సందీప్ రెడ్డి వంగా జత చేశారు. ఈ దర్శకుని కామెంట్లపై దీపికా పదుకొనే రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా 2027లో థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తున్నా హిట్టయ్యే ప్రాజెక్ట్ లను తెరకెక్కిస్తూ సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు అందుకుంటున్నారు.