ఆ సెంటిమెంట్ ఫలిస్తే అనగనగా ఒక రాజు భారీ బ్లాక్‌బస్టర్ పక్కా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ , జాతి రత్నాలు , మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. దానితో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా అద్భుతమైన గుర్తింపు ఉంది. నవీన్ పోలిశెట్టి చాలా కాలం క్రితం అనగనగా ఒక రాజు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని అనౌన్స్ చేసిన సమయంలో ఈ సినిమాలో శ్రీ లీల ను హీరోయిన్గా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ మూవీలో హీరోయిన్ పాత్ర నుండి శ్రీ లీల తప్పుకుంది.


దానితో మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంచుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధిస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఆ సెంటిమెంట్ ఏమిటి అనుకుంటున్నారా ..? అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల కానుండడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే అనగనగా ఒక రాజు సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: