టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ ఈ ముద్దుగుమ్మ యాక్ట్ చేస్తోంది. అయితే తాజాగా శ్రీలీల ఇంట జరిగిన ఓ సెలబ్రేషన్ ఆమెను వార్తల్లో సెన్సేషన్ గా మార్చింది. హల్దీ వేడుక, ఆపై అచ్చం పెళ్ళికూతురులా ముస్తాబై దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో శ్రీలీల పెళ్లి పీటలెక్కబోతోందని, ఎంగేజ్మెంట్ జరిగిందని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ తన లేటెస్ట్ ఫోటోల వెనుక ఉన్న స్టోరీని శ్రీలీల రివీల్ చేసింది. నిజానికి జరిగింది శ్రీలీల ఎంగేజ్మెంట్ కాదు.. ఆమె ప్రీ బర్త్ డే వేడుకలు. `ఒకప్పుడు మేము ఇంట్లో పుట్టిన రోజులు ఇలాగే జరుపుకునే వాళ్ళం.. మళ్లీ ఇప్పుడు అమ్మ ఇదంతా ప్లాన్ చేసింది` అంటూ అసలు విషయం చెప్పిన శ్రీలీల.. ఇన్స్టా వేదికగా మరికొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో శ్రీలీలను బుట్టలో ఎత్తడం, తులాభారం వేయడం వంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే శ్రీలీల షేర్ చేసిన పిక్స్ లో ఒక ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఈ పిక్ లో శ్రీలీలతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గబాటి సతీమణి, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్ కూడా కనిపించింది. ఇద్దరు క్లోజ్ గా హగ్ చేసుకుని ఫోటోకు పోజుచ్చారు. దీంతో రానా భార్యతో శ్రీలీలకు లింకేంటి అనే ప్రశ్న నెటిజన్స్ లో తలెత్తుతోంది. నిజానికి శ్రీలీల, మెహీకా మధ్య బ్లడ్ రిలేషన్ ఏమీ లేదు.. కానీ వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి మిహీకాతో శ్రీలీలకు పరిచయం ఉంది. ఇప్పటికీ తమ స్నేహాన్ని వీరిద్దరూ కంటిన్యూ చేస్తున్నారు. టైమ్ దొరికినప్పుడల్లా కలిసి చిల్ అవుతుంటారు. గతంలో కూడా మిహీకాతో కలిసి దిగిన ఫోటోలను శ్రీలీల పంచుకుంది. తాజాగా శ్రీలీల ప్రీ బర్త్డే వేడుకల్లోనూ మిహీకా సందడి చేసింది.