SSMB 29 మహేష్ , రాజమౌళి మూవీ అప్డేట్.. కొత్త షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ అంటే..?

Amruth kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నా SSMB 29 గురించి సినీ అని అభిమానంలో ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది అందరికి తెలిసిందే .ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశలోనే అనేక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది ఇక షూటింగ్ మొదలు పెట్టాక షూటింగ్ గురించి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి .. అయితే ఇప్పుడు తాజాగా ఈ సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్ తో మొదలుకానుందని తెలుస్తుంది ..



ఈ జూన్ 10 నుంచి వారణాసి లోని సెట్స్ లో ఈ సినిమా షెడ్యూల్ మొదలుకానుందని అంటున్నారు ..నిజానికి SSMB 29 షూటింగ్ ఇప్పటికే ఒడిశాలో కోరాపూర్ లో జరిగిన షెడ్యూలతో వార్తల్లో నిలిచింది అక్కడ జరిగిన షూటింగ్లో మహేష్ బాబు ,పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా ఈ షూట్లో పాల్గొన్న వీడియో లు కూడా బయటకు లీక్ అయిన విషయం తెలిసిందే ..ఇక ఇప్పుడు సమ్మర్ వెకేషన్ తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ వారణాసిలోని భారీ స్టేట్స్లో తన తదుపరి షెడ్యూల్ను మొదలుపెట్టనుంది ..



ఈ షెడ్యూల్లో ముఖ్యమైన సన్నివేశాలను తరికెక్కించేందుకు రాజమౌళి బృందం సన్నాహాలు చేసింది ..ఇక ఈ సినిమా ఒక జంగిల్ అడ్వెంచర్ కిల్లర్గా రాబోతుంది. ఇక ఇందులో పౌరాణిక అంశాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక రాజమౌళి గత సినిమాలైన బాహుబలి ,త్రిబుల్ ఆర్ లాగానే ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ తో దాదాపు 1000 కోట్లతో ఇక మహేష్ బాబు ఈ సినిమాలు ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు ..


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: