లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మోస్ట్
బ్యూటిఫుల్ నటీమణి
త్రిష హీరోయిన్గా మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే
మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో శింబు ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా
జూన్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ
మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో వెనుకబడిపోయింది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 2 రోజుల బాక్సా ఫీస్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
2 రోజుల్లో ఈ
మూవీ కి
తమిళ నాడు ఏరియాలో 19.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.65 కోట్లు , కేరళలో 1.65 కోట్లు ,
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.0 కోట్లు , ఓవర్సీస్ లో 25.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ
మూవీ కి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 25.70 కోట్ల షేర్ ... 52.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
మూవీ 106.50 కోట్ల టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 80.80 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ
మూవీ కి తమిళనాడు ఏరియాలో నెగిటివ్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది భావించారు. కానీ ఈ
మూవీ కి
తమిళ నాడు ఏరియాలో కూడా భారీ కలెక్షన్లు రావడం లేదు. దానితో ఈ
సినిమా భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.