టాలీవుడ్ లో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. గత వారమే నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని పెళ్లి పీటలెక్కాడు. అయితే తాజాగా `విరూపాక్ష` డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు పెళ్లి కూడా సెట్ అయింది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల్లో కార్తీక్ ఒకరు. `కార్తికేయ` వంటి బ్లాక్ బస్టర్ మూవీకి రైటర్ గా పని చేసిన కార్తీక్.. 2015లో `భమ్ భోలేనాథ్` మూవీతో డైరెక్టర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం అంతగా ఆడకపోయినా.. మేకింగ్ పరంగా కార్తీక్ కు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కార్తీక్.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో `విరూపాక్ష` వంటి హారర్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు అక్కినేని నాగచైతన్యతో ఓ మైథాలజికల్ మూవీని రూపొందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ఇదిలా ఉండగా.. హర్షిత అనే అమ్మాయిని త్వరలోనే కార్తీక్ వివాహం చేసుకోబోతున్నాడు. జూన్ 8న కార్తీక్ ఎంగేజ్మెంట్ జరిగింది. వధువు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల సమక్షంలో సింపుల్ గా ఈ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే వీరిది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కార్తీక్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారడంతో.. నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే జంట అదుర్స్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు