ఇషా కొప్పికర్.. అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు రావడం కష్టమే. కానీ `చంద్రలేఖ` మూవీ హీరోయిన్ అంటే మాత్రం టక్కున పట్టేస్తారు. మహారాష్ట్రకు చెందిన ఇషా.. మొదట మోడలింగ్ లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 1997లో తెలుగు చిత్రం W/o వరప్రసాద్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఈ చిత్రంలో ఒక సాంగ్ కు మాత్రమే పరిమితమైన ఆమె.. ఆ తర్వాత నాగార్జున హీరోగా తెరకెక్కిన `చంద్రలేఖ` మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇందులో తనదైన యాక్టింగ్ మరియు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అదే సమయంలో ప్రశాంత్ కు జోడిగా `కాదల్ కవితై` మూవీలో నటించి కోలీవుడ్ లోకి ప్రవేశించింది. అక్కడ తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో చంద్రలేఖ తర్వాత వెంకటేష్‌కు జోడిగా `ప్రేమతో రా` మూవీలో నటించింది. కానీ ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో.. చాలా కాలం టాలీవుడ్ లో కనిపించలేదు. తమిళ్, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా యాక్ట్ చేసింది.
2000 నాటికి ఇషా కొప్పికర్ దృష్టి బాలీవుడ్ పై పడింది. నార్త్‌లో ఈ భామ బాగానే నిలదొక్కుంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో స్టార్డమ్ సంపాదించుకుంది. 2013 తర్వాత సిల్కర్ స్క్రీన్ నుంచి కొంత గ్యాప్ తీసుకున్న ఇషా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అది కూడా తెలుగు చిత్రం `కేశవ`తో. నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీలో ఓ ముఖ్యమైన పాత్రను ఇషా పోషించింది. ఆపై ఇటు సౌత్, అటు నార్త్‌లో అడపా దడపా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ నటిగా రాణిస్తోంది. చివరిగా శివకార్తికేయన్ `అయలాన్` లో మెరిసింది.
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2009లో వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్‌ను ఇషా వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె. అయితే 2023లో భర్త నుంచి ఇషా కొప్పికర్ విడాకులు తీసుకుంది. ప్రస్తుతం కూతురితో సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోంది. ఇకపోతే 48 ఏళ్ల వయసు వచ్చినా ఇషా గ్లామర్ మాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా బికినీలో సూపర్ హాట్ గా కనిపిస్తూ నెట్టింట రచ్చ చేసింది. ఆమె వన్నె తగ్గని అందాలను చూశాక నెటిజన్లకు మతిపోతుంది. మరి లేటెందుకు మీరు కూడా ఆమె లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కేసేయండి.