గ్లోబల్ స్టార్
రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే
సినిమా లో
హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూ వీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు .
కన్నడ సినీ
పరిశ్రమ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
శివరాజ్ కుమార్ ఈ
మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నా డు . ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... వృద్ధి సిని
మాస్ , మైత్రి సంస్థ ,
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సం యుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ
మూవీ ని వచ్చే సంవత్స రం
మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ
మూవీ నుండి మేకర్స్ కొన్ని రోజుల క్రితం ఓ చిన్న వీడియోను విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు
తార స్థాయికి చేరిపోయాయి.
ఇకపోతే ఈ
మూవీ లో
బిగ్ బాస్ ఫేమ్ అంబటి
అర్జున్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈయన పెద్ది
సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజాగా అంబటి
అర్జున్ మాట్లాడుతూ ... పెద్ది
సినిమా అదిరిపోయే రేంజ్ విజయం సాధిస్తుంది అని నేను అనుకుంటున్నాను. బుచ్చిబాబు ఆ సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. సినిమాలో డ్రామా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. ఈ
సినిమా జాతీయ అవార్డును అందుకుంటుంది అని నేను నమ్ముతున్నాను అని అంబటి
అర్జున్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇలా అంబటి
అర్జున్ "పెద్ది"
సినిమా గురించి చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్
ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.