నటుడు రాంకీ అలియాస్ రామకృష్ణ గురించి పరిచయాలు అక్కర్లేదు. తమిళనాడు నటుడే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఈయన సుపరిచితుడే. 80వ దశకం చివర్లో తమిళ చిత్రాలతో హీరోగా కెరీర్ ప్రారంభించిన రాంకీ.. తక్కువ సమయంలోనే కోలీవుడ్ లో భారీ గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాలు చేశారు. 2004 వరకు హీరోగా కొనసాగిన రాంకీ.. 2013లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సహాయక నటుడిగా టర్న్ తీసుకున్నారు.
తెలుగులో ఇటీవల కాలంలో `ఆర్ఎక్స్ 100`, `డిస్కో రాజా`, `కస్టడీ`, `లక్కీ భాస్కర్` వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాంకీ మెరిసారు. అయితే రాంకీ భార్య ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా? ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు నిరోషా. ప్రముఖ సీనియర్ నటి రాధిక సోదరి అయిన నిరోషాను 1988లో లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం వెండితెరకు పరిచయం చేశారు. తనదైన అందం, అభినయంతో నిరోషా ఇండస్ట్రీలో త్వరగానే నిలదొక్కుకున్నారు. తమిళ్, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ భాషల్లోనూ ఆమె సినిమాలు చేశారు.
తెలుగులో `ముద్దుల మావయ్య`, `నారీ నారీ నడుమ మురారి`, `స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్`, `డిటెక్టివ్ నారద` తదితర చిత్రాల్లో నిరోషా యాక్ట్ చేశారు. బాలయ్య, చిరంజీవి వంటి అగ్రహీరోలతో తెర పంచుకున్న నిరోషా.. 1995లో రాంకీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఈ జంట పిల్లలను వద్దనుకోవడం గమనార్హం. ఇకపోతే పెళ్లి తర్వాత నిరోషా హీరోయిన్ గా రాణించలేకపోయారు. దాంతో వెండితెరకు దూరమై బుల్లితెరపై అడుగుపెట్టారు. తెలుగు, తమిళ్ భాషల్లో నిరోషా అనేక సీరియల్స్ నటించి మెప్పించారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు