సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2022లో నీల్ జన్మించాడు. వెళ్లి తర్వాత కాజల్ కెరీర్ డౌన్ అయింది అన్నమాట వాస్తవం. అయిన కూడా వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకుంటూ కాజల్ ముందుకు సాగుతోంది.
ఈ ఏడాది `సికందర్` సినిమాతో నార్త్ ప్రేక్షకులను పలకరించిన కాజల్.. త్వరలోనే విడుదల కాబోయే `కన్నప్ప`లో పార్వతీ దేవిగా కనిపించబోతుంది. అలాగే `ఇండియన్ 3`, బాలీవుడ్ `రామాయణ: పార్ట్ 1` వంటి ప్రాజెక్ట్స్‌లో కూడా కాజల్ భాగం అయింది.
సినిమాల గురించి పక్కన పెడితే.. జూన్ 19న కాజల్ నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టింది. తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు భర్త గౌతమ్, కొడుకు నీల్, చెల్లెలు నిషా అగర్వాల్ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాజల్ మాల్దీవ్స్ కు వెళ్లింది.
అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫుల్ గా చిల్ అయింది. పైగా ఎప్పుడు లేని విధంగా ఈసారి కాజల్ బికినీలో గ్లామర్ షోకి తెర లేపోయింది. బీచ్ లో చెల్లెలు నిషాతో కలిసి బికినీ ధరించి కుర్ర కారుకు చెమటలు పట్టించింది. ఇసుకలో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.
అలాగే వెకేషన్ లో కొడుకు మరియు భర్తతో కాజల్ సరదా సమయాన్ని గడిపింది. మాల్దీవ్స్ అందాలను ఆస్వాదిస్తూ కాజల్ పరవసించి పోయింది. ఇక వైట్ అండ్ వైట్ బికినీలో కాజల్ సొగసులు చూసి అల్లాడిపోవడం నెటిజన్ల వంతైంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు