శృతిహాసన్ సోషల్ మీడియా నుంచి అలాంటి పోస్టులు.. షాక్ లో ఫ్యాన్స్..!
అయితే ఈ విషయం శృతిహాసన్ వరకు వెళ్ళగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ నుంచి తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.. శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ నుంచి దయచేసి ఎవరూ కూడా ఆ మెసేజ్ లకు రిప్లై ఇవ్వకండి.. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలియజేయాలనుకుంటున్నాను అంటూ ఒక విషయాన్ని తెలిపింది శృతిహాసన్. తిరిగి తన అకౌంట్ రికవరీ చేసుకునే వరకు ఎవరు కూడా ఆ పేజీలో చాట్ చేయవద్దు.. ఎలాంటి విషయాలను షేర్ చేయవద్దు అంటూ లవ్ ఎమోజితో హార్ట్ సింబల్ ని షేర్ చేసింది శృతిహాసన్.
అయితే శృతిహాసన్ సోషల్ మీడియా హ్యాక్ అవ్వడం ఇదేమి ఫస్ట్ టైం కాదు.. 2017 లో కూడా శృతిహాసన్ ఖాతాను ఎవరో హ్యాక్ చేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇలా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడంతో శృతిహాసన్ అకౌంట్ ని హ్యాక్ చేస్తున్నది ఎవరా అని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. శృతిహాసన్ సినిమాల విషయంలో కూడా బాగానే ఇటివలె వరుస సినిమాలతో అదరగొట్టేస్తోంది. క్రాక్, వకీల్ సాబ్, వాల్తేరు వీరయ్య, సలార్ 1 తదితర చిత్రాలలో నటించింది. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలి సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి నటిస్తున్న ట్రైన్ చిత్రంలో కూడా నటిస్తున్నదట.