కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఉగ్రం అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా కన్నడలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈయన కన్నడ నటుడు అయినటువంటి యాష్ హీరోగా కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కే జి ఎఫ్ చాప్టర్ 2 కూడా మంచి విజయం సాధించడంతో ఈయన క్రెజ్ మరింతగా పెరిగింది.
కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ , ప్రభాస్ హీరోగా సాలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు. దీనిపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ చాలా కాలం నుండి రవణం అనే సినిమాను రూపొందించనున్నట్లు , ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్టు అయినటువంటి రావణం లో ఎవరు హీరోగా నటిస్తారు అనే దానిపై ఇంత కాలం పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది. కానీ రావణం సినిమాలో హీరోగా నటించేది ఆ స్టార్ హీరోనే అని ప్రస్తుతం ఓ వార్త బలంగా వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ప్రశాంత్ నీల్ , రావణం సినిమాలో అల్లు అర్జున్ ను హీరోగా అనుకుంటున్నారు అని , అందులో భాగంగా వీరిద్దరి మధ్య కొన్ని సమావేశాలు కూడా జరిగినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రశాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి రవణం మూవీలో అల్లు అర్జున్ నిజంగానే హీరోగా సెలెక్ట్ అయితే అది బన్నీ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.