ఇక మీరు మారరు .. ఇంకెందుకు మీ చావు ఏడుపు..?

Amruth kumar
ధనుష్ హీరోగా వచ్చిన కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు అందుకుంటుంది .. అయితే నిజానికి ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించుగా తమిళంలో సూపర్ స్టార్ గా ఉన్న ధ‌నుష్‌ హీరోగా నటించిగా తెలుగులో బాగా ఆడుతున్న ఈ సినిమా తమిళంలో కూడా మంచి బూస్ట్ వస్తుందని నిర్మాతలు అనుకున్నారు .. కానీ తమిళనాడు లో మాత్రం ప్రేక్షకులు  అసలు ఈ సినిమాని పట్టించుకోవడం లేదు .. అలా అని సినిమా బాలేదు అంటే అదేమీ లేదు .. విమర్శకుల నుంచి ప్రేక్షకులకు ఈ సినిమా బాగుందని కూడా అంటున్నారు .. అయినా సరే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా వైపు అసలు చూడటం లేదు . అయితే ఇలా ప్రవర్తించడం తమిళ ప్రేక్షకులకు ఇది మొదటిసారి కాదు ..



గతంలో ధనుష్ హీరోగా వ‌చ్చిన సార్ సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది .. అయితే ఇక్కడ తెలుగు దర్శకుడు , తెలుగు నిర్మాత కాబట్టి సినిమాని పక్కన పెట్టారని అనుకుంటే .. ఇది కొంతవరకు మాత్రమే కరెక్ట్ .. ఎందుకంటే గతంలో కోలీవుడ్ నిర్మాత ,తమిళ దర్శకులు తెరకెక్కించిన వీర ధీర సూరన్, తంగాలాన్‌, కంగువా .. తమిళ సత్యం సుంద‌రం లాంటి సినిమాలను కూడా వారు పెద్దగా పటించుకోలేదు .. వీటి ప్లేస్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ, లియో, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లాంటి హీరో యిజం బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలను మాత్రమే వారు బాగా ఆదరించారు ..



అయితే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే తమిళ ప్రేక్షకులు సినిమా కంటే హీరో ఎలివేషన్స్, హీరోలను ఆధారంగా చేసుకుని చేసిన సినిమాలను మాత్రమే బాగా చూస్తూ వస్తున్నారు .. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం అలా కాదు .. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ నచ్చితే . అది తమిళం , మలయాళం , కన్నడ , హిందీ  ఏ భాష అయినా పర్లేదు బెంగాలీ , ఒడియా లాంటి భాషల సినిమాలు కూడా చూసి ఆదరించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు .. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో ఎక్కడో ఆగిపోయారు .. అందుకే 2015లో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డును ఇప్పటికీ ఒక తమిళ సినిమా కూడా అందుకోలేక పోతుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: