షాక్: కన్నప్ప సినిమా రిలీజే కాలేదు.. అప్పుడే ఐటి రైట్స్..!

Divya
మంచు విష్ణు పాన్ ఇండియా లెవెల్ నటించిన చిత్రం కన్నప్ప.. ఈ చిత్రంలో భారీతారాగణం  నటిస్తూ ఉండడంతో సినిమాపై అన్ని భాషలలో హైప్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికే కన్నప్ప చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ లో కూడా వేగవంతంగా పాల్గొన్న చిత్ర బృందం అన్ని భాషలలో కూడా స్టార్ హీరోలతో ప్రమోషన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కన్నప్ప చిత్రానికి సంబంధించి తెలియని కొన్ని విషయాలను కూడా మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే భారీ బడ్జెట్ తో మంచు విష్ణు తమ సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని తెరకెక్కించడంతో పలు రకాల వార్తలు వినిపించాయి.


ఇప్పుడు తాజాగా మంచు విష్ణు ఆఫీసు ,ఇల్లుతో సహా మూవీకి చెందిన పలువురు ఇళ్లల్లో కూడా జీఎస్టీ సోదరులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో జిఎస్టి సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపైన ఇంకా కన్నప్ప టీం అధికారికంగా స్పందించలేదు. రీసెంట్ గా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మూవీ బడ్జెట్ గురించి చెబితే కచ్చితంగా అధికారులు తమ ఇంటి ముందు రైడ్ చేయడానికి క్యూ కడతారంటు వెల్లడించారు.


ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అన్నట్టుగానే అధికారులు కూడా మంచు విష్ణు  నివాసం పైన సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయం మాత్రం బయటికి రావడం లేదు. మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న సమయంలో కన్నప్ప చిత్రానికి ఇది భారీ షాక్ అనే చెప్పవచ్చు. మరి ఈ సమయంలో సోదాలు నిర్వహించడం కూడా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది. మరి ఈ విషయంపై మంచు విష్ణు ఏ విధంగా కామెంట్స్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: