టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ బిగినింగ్ లో ఏ స్థాయి విజయాలను అందుకున్నాడో ఆ రేంజ్ విజయాలను ఈ మధ్య కాలంలో మాత్రం అందుకోవడం లేదు. ఈయన ఆఖరుగా ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన లైజర్ , డబల్ ఇస్మార్ట్ మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు విజయ్ సేతుపతితో చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఈ మూవీ లో విజయ్ సేతుపతి కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి సంయుక్తా మీనన్ హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ మూవీ లో టబు ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా టబు ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనే దానిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో టబు పూర్తిగా నెగటివ్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో అందాదున్ సినిమాలో టబు నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది.
ఈ మూవీ తర్వాత చాలా కాలానికి టబు మరోసారి నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పూరి జగన్నాథ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలను రూపొందించిన ఫుల్ లెన్త్ లేడీ విలన్స్ రోల్స్ ను డిజైన్ చేయలేదు. మొట్ట మొదటి సారి పూరి జగన్నాథ్ తన కెరియర్ లో లేడీ విలన్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పూరి జగన్నాథ్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.