"కూలీ" సినిమాని మిస్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్న స్టార్స్ వీళ్లే..అందరూ తోపైన రిచ్ సెలబ్రిటీస్..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాలో ఆయన కూడా నటించాల్సి ఉండేది. కానీ, సౌరభ్ శోభిన్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించారు. ఈ పాత్ర కోసం మొదటగా ఫహద్ ఫాజిల్‌ను అనుకున్నారట. కానీ, పాత్ర నచ్చకపోవడంతో ఆయన రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. ఒకవేళ ఆ పాత్ర చేసుంటే సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ కి గురైయేవాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు “సేఫ్‌గా తప్పించుకున్నాడు” అని మాట్లాడుకుంటున్నారు.
కేవలం ఫహద్ ఫాజిల్ మాత్రమే కాదు, కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా ఈ సినిమా డిజాస్టర్ నుంచి తెలివిగా తప్పించుకున్నారు. నిజానికి లోకేష్ ఈ సినిమాను కమల్ హాసన్‌తో చేయాలని అనుకున్నారు. కానీ, కమల్ హాసన్ ఈ సబ్జెక్ట్ తనకు సూట్ అవ్వదని చెప్పి రిజెక్ట్ చేశారు.
నాగార్జున పాత్ర కోసం మొదటగా జాన్ అబ్రహంను అనుకున్నారు. కానీ, ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర నాగార్జునకు వచ్చింది. అంతేకాదు, స్పెషల్ సాంగ్ కోసం మొదట రష్మిక మందన్నాను అనుకున్నారు. కానీ, ఆమె “స్పెషల్ సాంగ్ చేయను” అని చెప్పడంతో, ఆ స్థానంలో పూజా హెగ్డే వచ్చింది. అలా కొంతమంది తెలివిగా ఈ సినిమా డిజాస్టర్‌ను తప్పించుకోగా, మరికొంతమంది అతి తెలివితేటలతో ఈ డిజాస్టర్ టాక్‌లో బుక్ అయ్యారు అంటున్నారు జనాలు. చూడాలి మరి, లోకేష్ ఈ నెగిటివిటీని తన తర్వాతి సినిమాలతో ఎలా పాజిటివిటీగా ఎలా మార్చుకుంటారో...??