జూనియర్
ఎన్టీఆర్ కొంత కాలం క్రితం
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాలో
హీరో గా నటించాడు.
జాన్వి కపూర్ ఈ
మూవీ లో హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ లో
బాలీవుడ్ నటుడు
సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
తారక్ ఈ
సినిమా విడుదల అయిన తర్వాత దేవర పార్ట్ 2
మూవీ పై కాకుండా మరి కొన్ని సినిమాలపై ఫోకస్ పెట్టాడు. దానితో దేవర పార్ట్ 2
మూవీ ఉండదు అని అనేక వార్తలు వచ్చాయి. దానితో చాలా మంది ప్రేక్షకులు కూడా దేవర పార్ట్ 2
మూవీ ఉండదు అని అనుకున్నారు. అలాంటి సమయం లోనే ఒకానొక
సినిమా ఈవెంట్లో పాల్గొన్న
తారక్ దేవర పార్ట్ 2 ఉండదు అని అనేక వార్తలు వస్తున్నాయి. అవి పూర్తిగా అవాస్తవం.
కొరటాల శివ ప్రస్తుతం దేవర పార్ట్ 2
మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరికొంత కాలం లోనే ఆ
సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని చెప్పాడు. దానితో మళ్లీ జనాలు అంతా దేవర పార్ట్ 2
మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతుంది అని అనుకున్నారు.
ఇకపోతే ఈ మధ్య కాలంలో మళ్ళీ దేవర పార్ట్ 2
మూవీ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. దేవర పార్ట్ 2
మూవీ ఉండదు అని ,
కొరటాల శివ తన తదుపరి
మూవీ ని
నాగ చైతన్య తో చేయడానికి రెడీ అయ్యాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. దానితో కొంత మంది
తారక్ చెప్పాడు అంటే
సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర పార్ట్ 2
మూవీ ఉంటుందా ..? లేదా అనేది చూడాలి.