కూలీ, వార్-2 లాంగ్ వీకెండ్ కలెక్షన్ల హంగామా.. ఇక అసలు పరీక్ష మొదలు!
తెలుగులో కూడా 60-70% వరకు రికవరీ సాధించడం కూలీకి ప్లస్ పాయింట్ అయ్యింది. కొన్ని చోట్ల 80% వరకు వచ్చిందంటే రజినీ మాస్ స్టామినా ఏమిటో అర్థం అవుతుంది. అయితే సోమవారం నుంచి రన్ కొనసాగించడం మాత్రం ఈ సినిమాకి పెద్ద సవాలే. మరోవైపు వార్-2 మొదటి రోజు అనుకున్నంత స్థాయిలో ఆరంభం కాకపోయినా ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను బాగానే ఉపయోగించుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లకు చేరువగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లో హృతిక్ మార్కెట్ తో పాటు ఎన్టీఆర్ క్రేజ్ కూడా కలిసొచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించినంత సత్తా చూపలేకపోయింది. డెఫిషిట్లతో కొన్ని చోట్ల షోలు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాక్ పెద్దగా కలసిరాకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్ గా మారింది.
ఇప్పటి వరకూ కూలీ రన్ బాగానే సాగినా.. అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. వీక్ డేస్ లో వసూళ్లు నిలబెట్టుకోవడమే ఈ సినిమాకి కీలకం. ఇక వార్-2 విషయంలో పరిస్థితి మరింత కఠినంగా కనిపిస్తోంది. తెలుగులో ఈ సినిమా ఇప్పటిదాకా రాబట్టాల్సిన షేర్ లో సగం కూడా రాబట్టలేకపోయింది. కాబట్టి నష్టాలు తప్పవని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ వారం పెద్ద రిలీజ్లు లేకపోవడం మాత్రం రెండు సినిమాలకు అదనపు అడ్వాంటేజ్ అని చెప్పాలి. కూలీ తన పుంజుకునే జోరు కొనసాగిస్తేనే బ్రేక్ ఈవెన్ చేరగలదు. వార్-2 విషయంలో అయితే వసూళ్ల క్షీణత ముందే కనిపిస్తోందని చెప్పాలి. మొత్తానికి ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను బాక్సాఫీస్ ఫెస్టివల్ గా మార్చుకున్న ఈ రెండు సినిమాల అసలు సత్తా రాబోయే వారం లోనే తేలనుంది.