ఇదంతా చిరంజీవి కోసమే జరుగుతోందా..?

Divya
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. జీతాలు పెంచాలి అంటూ కార్మికులు సమ్మె చేయడంతో..ఒకవైపు నిర్మాతలు, మరొకవైపు ఫెడరేషన్ నేతలతో పాటుగా, ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గతంలో జరిగిన సమ్మేలో ఛాంబర్ చాలా కీలకమైన పాత్ర పోషించింది అన్నట్లుగా తెలుస్తోంది. ఫెడరేషన్ నేతలతో ఎవరు సంప్రదింపులు జరిపేది దీనిపట్ల ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే విషయం పైన స్పష్టత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత రెండు మూడు రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి పేరు ఎక్కువగా చర్చనీయంశంగా మారింది.



నిన్నటి రోజున కొంతమంది బడా నిర్మాతలు అంతా కూడా చిరంజీవి కలవడానికి వస్తున్నారంటు పిఆర్వోలు, మీడియా లీకులు ఇచ్చినట్లుగా వార్తలు వినిపించాయి.. కానీ అక్కడికి కేవలం సి .కళ్యాణ్ తప్పించి పెద్ద నిర్మాతలు ఎవరు కూడా రాలేదు. సాయంత్రం పూట మరో నిర్మాత నట్టి కుమార్ మాత్రమే కలిశారు. అయితే వీరు చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించబోతున్నారంటూ తెలిపారు. గడచిన కొద్ది రోజుల క్రితం మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం తరఫునుంచి దిల్ రాజు అందరితో మాట్లాడుతారు అంటూ తెలియజేశారు. అయితే సమ్మె విషయం పైన మాత్రం దిల్ రాజు మౌనంగానే ఉన్నారు.


ఈ సమ్మె విషయంలో బాధ్యతను పరిష్కరించేలా  చిరంజీవికి అప్పజెప్పారనే విధంగా ప్రచారమైతే జరిగింది. ఇలా చేయడం వల్లే దిల్ రాజు పక్కకి తప్పుకున్నారని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా చిరంజీవితో ఒక సినిమా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ ఈసారి మటుకు షెడ్యూల్ మిస్ అయితే సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయడం కష్టమే అని దీనివల్ల ఆర్థికంగా కూడా నష్టపోతారని ప్రచారం చేస్తున్నారట. అయితే ఇతర రాష్ట్రాలలో షూటింగ్ తీద్దామని ప్రతిపాదన తీసుకువస్తే చిరంజీవి తిరస్కరించారని వినిపిస్తున్నాయి.

చిరంజీవి కూడా ఇటీవలే ఫెడరేషన్ వారు ఎవరూ కూడా తనని సంప్రదించలేదని అదంతా కేవలం రూమర్సే అంటూ తెలిపారు. ఒకవేళ పక్క రాష్ట్రాలకు వెళ్లి షూటింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా తాను అందరి మనిషినికాదనే ఇమేజ్ దెబ్బతింటుందని భావించి సమ్మె పరిష్కారమే మార్గమని భావించినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత భాగస్వామిగా నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: