50 ఏళ్ళ నాటి రూల్స్ తో ఇప్పుడు సినిమాలు కష్టం.. నిర్మాత ఎస్కెఎన్ కామెంట్స్ వైరల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాలేవనే సంగతి తెలిసిందే. అయితే సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతలు ఏ మాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఎస్కెఎన్ వేతనాలు పెంచాలని సినీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ముగింపు పలకాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇతర సినిమా ఇండస్ట్రీలో ఉన్న విధంగా టాలీవుడ్ లో సినీ కార్మికుల పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారని ఆయన అన్నారు.

పలు కారణాల వల్ల నిర్మాతకు లాభం రావడం లేదని  ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులలో కార్మికులకు వేతనాలు పెంచడం మరింత భారమవుతుందని  ఈ ఏడాది 10 శాతం   వచ్చే ఏడాది నుంచి  రెండు సంవత్సరాల పాటు 5  శాతం  పెంచుతామని  నిర్మాతలు వెల్లడించారు.  ఈ పెంపు ఇతర ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే  ఎక్కువ మొత్తమని  కామెంట్లు చేశారు.

రోజుకు 2,000 రూపాయలు తీసుకుంటున్న వాళ్లకు అంతకంటే ఎక్కువ మొత్తం  తీసుకునే వాళ్లకు వేతనాలు పెంచడం సరికాదని ఆయన తెలిపారు.  ఈ క్లిష్ట పరిస్థితులలో  సినిమా మేకింగ్ ను ఇంకా సమర్థవంతంగా చేసే మార్గాలను అన్వేషించాలని ఆయన చెప్పుకొచ్చారు.  సినీ కార్మికుల వేతనాలను పెంచడానికి చిన్న నిర్మాతలు  అంగీకరించడం లేదని ఆయన పేర్కొన్నారు.

సినిమా కోసం  24 విభాగాల కార్మికులు  పని చేసే విధానం మారాల్సిన అవసరం అయితే ఉందని ఆయన కామెంట్లు చేశారు.  50 సంవత్సరాల క్రితం యూనియన్లు రాసుకున్న నిబంధనలను  అనుసరిస్తే ఇప్పటి నిర్మాతలు సినిమాలను నిర్మించలేరని  ఆయన చెప్పుకుకొచ్చారు. ఈ నిర్మాత చెప్పిన కామెంట్లలో సైతం నిజం ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతుండటం గమనార్హం .


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

skn

సంబంధిత వార్తలు: