ఇప్పుడంటే సినిమాల్లో లిప్ లాక్స్ అనేవి కామన్ అయిపోయింది. కానీ 80, 90 దశకాల్లో అటువంటి సీన్స్ చాలా అంటే చాలా అరుదుగా కనిపించేవి. అయితే అప్పట్లోనే అక్కినేని మన్మధుడు,
టాలీవుడ్ కింగ్ నాగార్జునతో మూడు నిమిషాలకు పైగా లిప్ లాక్ లో పాల్గొని రికార్డ్ సెట్ చేసిందో హీరోయిన్. ఇంతకీ ఆ
హీరోయిన్ ఎవరు తెలుసా.. గిరిజ. నాగార్జున,
గిరిజ కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్
లవ్ స్టోరీ `గీతాంజలి`. మణిరత్నం తెలుగులో డైరెక్ట్ చేసిన ఏకైక ఫిల్మ్ ఇది.
ఇళయరాజా సంగీతం అందించారు.
హీరో,
హీరోయిన్ చనిపోతారు అనే ట్రాజెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అనుమానాల నడవ 1989లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఉత్తమ ప్రజాదారణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే ఆరు నంది అవార్డులను సైతం కైవసం చేసుకుంది. తొలి సినిమాతోనే హీరోయిన్
గిరిజ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
గీతాంజలి సినిమాలోని `ఓం నమః` సాంగ్ లో నాగార్జునకు మూడు నిమిషాలకు పైగా లిప్ లాక్ ఇచ్చి రికార్డు సెట్ చేసిన ఘనత గిరిజకే సొంతం. అయితే
హీరోయిన్స్ ఒక
సినిమా హిట్ అయ్యిందంటే ఆ వెంటనే మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంటారు. కానీ
గిరిజ అందుకు పూర్తిగా భిన్నం.
గీతాంజలి తర్వాత ఆమె పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపలేదు. విదేశాలకు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. ఇక అప్పటికీ ఇప్పటికీ
గిరిజ చాలా మారిపోయింది. ముఖం అంతా ముడతలు పడిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారైంది.
ఈ
వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు
వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు